Rakhi Sawant: రాఖీ సావంత్ కు షాక్ ఇచ్చిన కొత్త బోయ్ ఫ్రెండ్ ! 

Rakhi Sawant says boyfriend Adil Khan didnot meet her in Delhi
  • ఢిల్లీకి వచ్చినా రాఖీ సావంత్ ను కలుసుకోని ఆదిల్ ఖాన్
  • బాధతో ముంబై వెళ్లిపోయిన రాఖీ
  • అతడికి కాల్ చేయబోనని, ఆత్మగౌరవం ముఖ్యమని వ్యాఖ్య 
సినీ, టీవీ నటి రాఖీ సావంత్ వ్యక్తిగత జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్లినా వెంట బోయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ తో దర్శనమిస్తున్న రాఖీ సావంత్.. మొదటిసారి ఒంటరిగా ముంబై ఎయిర్ పోర్ట్ లో బుధవారం కనిపించింది.  పింక్ సల్వార్ సూట్ లో, చెదిరిన మేకప్ తో దర్శనమిచ్చింది.  

బోయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ ను కలుసుకునేందుకు ఢిల్లీ వరకు వెళ్లానని, అయినా అతడు తనను కలవలేదని రాఖీ సావంత్ ఆవేదనగా చెప్పింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆమె మాట్లాడిన వీడియోని ఒకరు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. అందమైన పొడవాటి కురులతో కనిపించిన ఆమె.. ‘‘ఆదిల్ కోసమే ఇలా రెడీ అయ్యాను. ఫ్లయిట్ లో రెండు గంటల పాటు ఏడవడంతో నా కాజల్ చెరిగిపోయింది. నేను ఇప్పుడు అతడికి కాల్ చేయడం లేదు. ఆత్మ గౌరవమే నా వ్యక్తిత్వం. నేను నిన్న ఢిల్లీకి వెళ్లి, ఈ రోజు ముంబైకి వచ్చానని మీకు తెలుసా? అతడు నన్ను కలుసుకునేందుకు కూడా రాలేదు. మేము ఇద్దరం కలసి ముంబైకి రావాల్సి ఉంది. నేను ఎంతో బాధలో ఉన్నాను’’ అని రాఖీ సావంత్ పేర్కొంది.  

మరోపక్క, రాఖీ సావంత్ అభిమానులు సైతం ఆమెనే తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. మాజీ భర్త రితేష్ మాదిరే ఆదిల్ ఖాన్ కూడా అసంతృప్తికి గురై ఉంటాడన్న కామెంట్లు కనిపించాయి. రాఖీ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొంది. 2009లో ‘రాఖీ కా స్వయంవర్’ పేరుతో ఓ టీవీ ఛానల్ లో రియాలిటీ షోను నిర్వహించి సంచలనం సృష్టించింది. ఆ కార్యక్రమం ద్వారా టొరెంటోకు చెందిన ఎలేష్ పురుంజన్ వాలాను ఆమె భాగస్వామిగా ఎంపిక చేసుకుంది. కొన్ని నెలల తర్వాత విడిపోయింది. 2019లో ఎన్ఆర్ఐ రితేష్ ను వివాహం చేసుకుని 2022 ఆరంభంలో వేరు పడింది. ఆ తర్వాత ఆదిల్ ఖాన్ దుర్రానీకి దగ్గరైంది. (వీడియో కోసం)
Rakhi Sawant
upset
boyfriend
Adil Khan
not met

More Telugu News