Sajith Premadasa: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, భారత ప్రజలకు ఆ దేశ విపక్ష నేత సజిత్ ప్రేమదాస విన్నపం!

  • శ్రీలంక దేశాధ్యక్ష పదవికి ఈరోజు జరుగుతున్న ఎన్నికలు
  • లంక మాతను సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మోదీని కోరిన ప్రేమదాస
  • అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా సాయం చేయాలని విన్నపం
Sri Lanka opposition leader Sajith Premadasa appeal to Modi and Indians

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో దేశాధ్యక్ష పదవికి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ సాయాన్ని కోరుతూ ఆ దేశ విపక్ష నేత సజిత్ ప్రేమదాస చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. శ్రీలంక అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా... లంక మాతను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని గౌరవనీయులైన భారత ప్రధాని మోదీని, అన్ని రాజకీయ పార్టీలను, భారతదేశ ప్రజలను కోరుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. శ్రీలంకకు పెద్దన్న మాదిరి ఉండే భారత్ తన సహాయ, సహకారాలను కొనసాగించాలని కోరారు. 

గొటబాయ రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంక అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘేకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

More Telugu News