చరణ్ తో లోకేశ్ కనగరాజ్ సినిమా ఖరారైనట్టే!

  • శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్
  • తరువాత ప్రాజెక్టు గౌతమ్ తిన్ననూరితో 
  • లైన్లో ఉన్న లోకేశ్ కనగరాజ్ 
  • నిర్మాణ సంస్థ మైత్రీ అంటూ టాక్   
Charan in Lokesh Kanagaraj movie

చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని కనిపించనుంది. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. 

ఆ తరువాత సినిమాను లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చరణ్ చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ లో తనకి బాగా పరిచయం ఉన్న హీరో చరణ్ అనీ .. ఆయనకి ఒక కథను కూడా వినిపించానని లోకేశ్ కనగరాజ్ కొన్ని రోజుల క్రితం చెప్పాడు. ఇప్పుడు మైత్రీ బ్యానర్ వారితో ఆయన ప్రాజెక్టు ఓకే అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

దాంతో ఈ సినిమా చరణ్ తోనే ఉండనుందని అంటున్నారు. దాదాపు ఈ కాంబినేషన్ సెట్ అయినట్టే అంటున్నారు. ఇటీవల 'విక్రమ్' సినిమా హిట్ అయిన సందర్భంగా కమల్ తో పాటు లోకేశ్ కనగరాజ్ కూడా చిరంజీవి ఆతిథ్యాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ .. విజయ్ తో మరో సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

More Telugu News