TDP: జ‌గ‌న్ స‌ర్కారు వ‌ర‌ద సాయంపై చంద్ర‌బాబు కామెంట్‌!

chandrababu satire on ap governments rehabilitation measures to flood effected people
  • ఇటీవ‌లి వ‌ర్షాల‌కు నీట మునిగిన వంద‌లాది ప‌ల్లెలు
  • వ‌ర‌ద బాధితుల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం
  • నాలుగంటే నాలుగే ఇచ్చారంటూ చంద్ర‌బాబు సెటైర్‌

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా ఏపీలోని వంద‌లాది ప‌ల్లెలు నీట మునిగాయి. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు రంగంలోకి దిగిన రాష్ట్ర ప్ర‌భుత్వం ముంపు బాధితుల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేస్తోంది. ఇలా వైసీపీ స‌ర్కారు ముంపు బాధితుల‌కు అందించిన వ‌ర‌ద సాయం ఇదేనంటూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా మంగ‌ళ‌వారం ఓ ఫొటోను పంచుకున్నారు. నాలుగంటే... నాలుగేనంటూ ఆయ‌న స‌ద‌రు పోస్ట్‌కు కామెంట్ జ‌త చేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌ర్కారు అంద‌జేసిన వ‌ర‌ద సాయం నిత్యావసరాల‌ను ఓ చేట‌లో పెట్టిన ఫొటోను చంద్ర‌బాబు త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. అందులో నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు మాత్ర‌మే ఉన్న విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం.... లెక్క చూసుకో జగన్ రెడ్డి... నాలుగంటే నాలుగే! అంటూ చంద్ర‌బాబు ఓ సెటైర్ సంధించారు.

  • Loading...

More Telugu News