Cooking oils: వంట నూనెల ధర లీటర్ కు రూ.14 తగ్గింపు.. ప్రకటించిన పతంజలి ఫుడ్స్.. మరిన్ని కంపెనీలూ అదే దారిలో!

  • కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు వంట నూనెల ధరలు తగ్గిస్తున్న కంపెనీలు
  • అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో నిర్ణయం
  • గత 45 రోజుల్లో మొత్తంగా లీటర్ కు రూ.35 వరకు ధరలు తగ్గించామన్న పతంజలి ఫుడ్స్ కంపెనీ
patanjali foods to soon reduce prices of cooking oils

తమ బ్రాండ్ కింద విక్రయించే వివిధ వంట నూనెల ధరలను లీటర్ కు రూ.10 నుంచి రూ.15 వరకు తగ్గించనున్నట్టు పతంజలి ఫుడ్స్ సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నూనెల ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా పరిస్థితులకు అనుగుణంగా దేశంలో వంట నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలోని కంపెనీలను ఆదేశించిన విషయం తెలిసిందే. 

వరుసగా ఒక్కో కంపెనీ..
కేంద్రం సూచనల మేరకు.. మదర్ డెయిరీ లీటర్ కు రూ.14 వరకు, ఆదానీ విల్మర్ (ఫ్రీడమ్ ఆయిల్) కంపెనీ రూ.30 వరకు తగ్గించాయి. తాజాగా పతంజలి ఫుడ్స్ (ఇటీవలి వరకు రుచి సోయా) కంపెనీ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మరికొన్ని కంపెనీలు కూడా తమ బ్రాండ్ల వంట నూనెల ఎమ్మార్పీని తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 

లీటర్ కు రూ.45 దాకా తగ్గినట్టే..
‘‘పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, సోయా ఆయిల్ ల ధరలను రూ.10 – రూ.15 వరకు తగ్గించనున్నాం. గత 45 రోజుల్లో తగ్గించినవి, తాజా తగ్గింపు కలిపి లీటర్ నూనెపై రూ.30–35 వరకు ధర తగ్గించినట్టు అవుతోంది. చాలా కొన్ని కంపెనీలు మాత్రమే వంట నూనెల ధరలు తగ్గిస్తున్నాయి..” అని పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్తానా తెలిపారు.

More Telugu News