Borders: సరిహద్దుల్లో 100 కి.మీ. వరకు రహదారుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదు: కేంద్ర ప్రభుత్వం

No need for green clearance within 100 KM from borders for highways
  • ఎల్వోసీ, ఎల్ఏసీ ల నుంచి 100 కి.మీ. వరకు గ్రీన్ క్లియరెన్స్ అవసరం లేదు
  • రక్షణశాఖ అవసరాల నేపథ్యంలో కీలక నిర్ణయం
  • ఎయిర్ పోర్టుల్లో టెర్మినల్ బిల్డింగుల విస్తరణకు కూడా అనుమతులు అవసరం లేదన్న కేంద్రం

పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణకు సంబంధించి సరిహద్దుల్లో రహదారులను నిర్మించే విషయంలో పర్యావరణ అనుమతులు అవసరం లేదని చెప్పింది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖల నుంచి 100 కిలోమీటర్ల వరకు నిర్మించే రహదారులకు గ్రీన్ క్లియరెన్స్ అవసరం లేదని తెలిపింది. 

రక్షణ శాఖ అవసరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాల్లోని ఎయిర్ పోర్టుల్లో టెర్మినల్ బిల్డింగ్ లను విస్తరించడానికి కూడా అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. కోల్, లిగ్నైట్, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా నడిచే బయోమాస్ ఆధారిత పవర్ ప్లాంట్లను కూడా 15 శాతం వరకు విస్తరించుకునే వెసులుబాటును కల్పించింది.

  • Loading...

More Telugu News