Google Pixel 6a: భారత్ లో లాంచ్ కానున్న గూగుల్ పిక్సల్ 6ఏ

  • ఈ నెలాఖరున విడుదల కావచ్చన్న సమాచారం
  • ధర రూ.40వేల లోపు ఉండే అవకాశం
  • గూగుల్ నుంచి అధికారికంగా రాని ప్రకటన
Google Pixel 6a price in India likely to be under Rs 40000

గూగుల్ పిక్సల్ 6 సిరీస్ కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ త్వరలోనే ఫలించనుంది. ఈ నెలాఖరులో గూగుల్ పిక్సల్ 6ఏ భారత మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధర కూడా రూ.40,000 లోపు ఉంటుందని తెలుస్తోంది. పిక్సల్ 4ఏ తర్వాత గూగుల్ మరో ఫోన్ ను భారత మార్కెట్లోకి ఇంత వరకు తేలేదు. మధ్యలో పిక్సల్ 5 సిరీస్ ను గూగుల్ ఇతర మార్కెట్లలో విడుదల చేసినా, ఎందుకనో భారత్ మార్కెట్ కు పరిచయం చేయలేదు. 


ఇక ఇప్పుడు నేరుగా పిక్సల్ 6ఏను తీసుకురానుంది. గూగుల్ పిక్సల్ 6, 6 ప్రో ఫోన్లు లోగడే అమెరికాలో విడుదలయ్యాయి. పిక్సల్ 6ఏ ఫీచర్లు 6ను పోలి ఉంటాయి. ఇందులో గూగుల్ సొంత చిప్ అయిన టెన్సార్ ఉంటుంది. పిక్సల్ 6 మాదిరే డిజైన్ ఉంటుంది. 

టిప్ స్టర్ అంచనా ప్రకారం పిక్సల్ 6ఏ ధర భారత్ లో రూ.37,000గా ఉండొచ్చని తెలుస్తోంది. కానీ, విడుదల తేదీ, ధరలను ఇంత వరకు గూగుల్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ నెలాఖరుకు వీటిని విడుదల చేయవచ్చని, ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలు జరుగుతాయని తాజాగా సమాచారం బయటకు వచ్చింది. 6ఏను గూగుల్ కెనడా మార్కెట్లో విడుదల చేయగా, అక్కడ 599 కెనడా డాలర్ల ధర నిర్ణయించింది. బ్రిటన్ లో 399 పౌండ్లుగా నిర్ణయించింది.

More Telugu News