Chandrababu: బాలకోటి రెడ్డికి ఏం జరిగినా జగనే సమాధానం చెప్పాలి: చంద్రబాబు

Whatever happens to Balakoti Reddy Jagan has to answer says Chandrababu
  • పల్నాడు జిల్లాలో బాలకోటిరెడ్డిపై హత్యాయత్నాన్ని ఖండించిన చంద్రబాబు
  • జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ రౌడీలు రెచ్చిపోతున్నారని మండిపాటు
  • పోలీసులు కల్పించుకోవద్దని జగన్ ఆదేశాలిచ్చారా? అని ప్రశ్న
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై అలవల గ్రామంలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ... బాలకోటిరెడ్డిపై వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్లతో దాడి చేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు. 

టీడీపీ నేతలు, కార్యకర్తల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉందని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ రెడ్డి ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారని ప్రశ్నించారు. 

తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? అని చంద్రబాబు అడిగారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న బాలకోటిరెడ్డికి ఏం జరిగినా దానికి జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని అన్నారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Palnadu
Murder Attempt

More Telugu News