Adivi sesh: పాన్ ఇండియా రేంజ్ లో 'గూఢచారి' సీక్వెల్!

Goodachari movie sequel update
  • 'మేజర్'తో హిట్ కొట్టిన అడివి శేష్ 
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'హిట్ 2'
  • శైలేశ్ కొలను రూపొందించిన సినిమా ఇది
  • ఫ్రాంచైజీగా రానున్న 'గూఢచారి 2'
అడివి శేష్ హీరోగా ఇటీవల వచ్చిన 'మేజర్' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'హిట్ 2' చేశాడు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా అలరించనుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

'క్షణం' .. 'గూఢచారి' .. 'మేజర్' వంటి సినిమాలను బట్టి చూస్తే, అడివి శేష్ ఒక ప్రత్యేకమైన జోనర్లో ముందుకు వెళుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ తరహా జోనర్లు సక్సెస్ ను కూడా తెచ్చిపెడుతుండటంతో ఆయన కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ  ప్రయత్నంలో భాగంగానే 'గూఢచారి 2'పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. 

అడివి శేష్ హీరోగా 2018 లో వచ్చిన 'గూఢచారి' భారీ విజయాన్ని నమోదు చేసింది. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఇదే టైటిల్ తో ఫ్రాంచైజీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట. మొత్తానికి అడివి శేష్ తనకంటూ ఒక జోనర్ ను సెట్ చేసుకున్నట్టే అనుకోవాలి.
Adivi sesh
Goodachari Sequel
Tollywood

More Telugu News