BJP: విశాఖ‌, నెల్లూరు రైల్వే స్టేష‌న్లు త్వ‌ర‌లోనే ఇలా మారిపోతాయ‌ట‌!

bjp ap branch releases vizag and nellora railway stations new designs
  • రైల్వే స్టేష‌న్ల ఆధునికీక‌ర‌ణ‌కు కేంద్రం క‌స‌ర‌త్తు
  • ఇప్ప‌టికే తిరుప‌తి రైల్వే స్టేష‌న్ డిజైన్ల ఆవిష్క‌ర‌ణ
  • అభ్యంత‌రాలు రావ‌డంతో పునఃప‌రిశీల‌న‌కు డిజైన్లు
  • తాజాగా విశాఖ‌, నెల్లూరు స్టేష‌న్ల డిజైన్ల విడుద‌ల‌
దేశంలో రైల్వే స్టేష‌న్ల రూపు రేఖ‌ల‌ను స‌మూలంగా మార్చేసే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ప్ర‌ధాన రైల్వే స్టేష‌న్ల‌ను ఆధునికీక‌రించి... ద‌శ‌ల వారీగా మిగిలిన రైల్వే స్టేష‌న్ల‌ను కూడా ఆధునికీక‌రించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ యాక్ష‌న్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా తిరుప‌తి రైల్వే స్టేష‌న్ నూత‌న డిజైన్ల‌ను ఆ శాఖ విడుద‌ల చేయ‌గా... ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో వాటిని పునఃప‌రిశీల‌న‌కు తీసుకుంది.

తాజాగా సోమవారం విశాఖప‌ట్నం, నెల్లూరు రైల్వే స్టేషన్ల‌కు సంబంధించిన నూత‌న డిజైన్ల‌ను రైల్వే శాఖ విడుద‌ల చేసింది. రాజ‌కోట‌ల మాదిరిగా క‌నిపిస్తున్న ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ఆ శాఖ సేక‌రించ‌నుంద‌ట‌. ఈ డిజైన్ల‌ను బీజేపీ ఏపీ శాఖ సోమవారం రాత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసింది.
BJP
Vizag
Nellore
Indian Railways
Railway Stations

More Telugu News