TDP: మాజీ మంత్రి కాల‌వ శ్రీనివాసులు కూతురు పెళ్లి.. చంద్ర‌బాబుకు ఆత్మీయ ఆహ్వానం

  • కాలవ కుమార్తె గౌత‌మి వివాహం నిశ్చ‌యం
  • నేడు చంద్ర‌బాబుకు ఆహ్వాన ప‌త్రిక‌ను అందించిన కాల‌వ
  • ఫొటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్న మాజీ మంత్రి
ex minister Kalava Srinivasulu invites chandrababu to his daughters marriage

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కాల‌వ శ్రీనివాసులు కుమార్తె గౌత‌మి వివాహం ఖ‌రారైంది. ముహూర్తాలు కూడా ఖ‌రార‌య్యాయి. త్వర‌లోనే జ‌ర‌గ‌నున్న ఈ వివాహ వేడుక‌కు సంబంధించిన ఏర్పాట్ల‌లో కాల‌వ శ్రీనివాసులు నిమ‌గ్న‌మ‌య్యారు. అందులో భాగంగా త‌న కూతురు వివాహ‌నికి హాజరు కావాలంటూ ఆయ‌న పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడును సోమ‌వారం ఆహ్వానించారు. 

ఈ మేర‌కు సోమ‌వారం ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసానికి వెళ్లిన కాలవ‌... వివాహ ఆహ్వాన ప‌త్రిక‌ను చంద్ర‌బాబుకు అంద‌జేశారు. అందుకు సంబంధించిన ఫొటోను కాల‌వ శ్రీనివాసులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. త‌న కుమార్తె వివాహానికి సంబంధించి అధినేత‌కు ఆత్మీయ ఆహ్వానం ప‌లికానంటూ ఆ ఫొటోకు ఆయ‌న ఓ కామెంట్‌ను జ‌త చేశారు.

More Telugu News