Road Accident: కామారెడ్డి జిల్లాలో రాంగ్ రూట్ లో వచ్చి లారీని ఢీకొన్న ఆటో... ఆరుగురి మృతి

Six killed in Auto and Lorry collision in Kamareddy district
  • మద్నూరు మండలంలో ఘటన
  • వేగంగా వెళుతున్న రెండు వాహనాలు
  • లారీ కిందిభాగంలోకి చొచ్చుకుపోయిన ఆటో

కామారెడ్డి జిల్లాలో ఓ ఆటో, కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మద్నూరు మండలం మెనూరు వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వస్తున్న ఆటో... లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండు వాహనాలు వేగంగా వెళుతుండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. లారీ కింది భాగంలోకి ఆటో చొచ్చుకుపోగా, ఆటోను బయటికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

కాగా, ప్రమాద సమయంలో ఆటోలో ఎంతమంది ఉన్నారు? వారు ఎక్కడివారన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటిదాకా 6 మృతదేహాలను బయటికి తీశారు. ఆటో మద్నూరు నుంచి బిచ్కుంద వైపు  వెళుతుండగా, కంటైనర్ లారీ హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు వెళుతున్నట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News