Vijayasai Reddy: ఇక సీఎం కాలేనని బాబుకు అర్థమైంది.. అందుకే అసెంబ్లీకి వెళ్లి ఓటేశాడు: విజయసాయి

Vijayasai Reddy comments on Chandrabu
  • ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
  • అసెంబ్లీకి వెళ్లి ఓటేసిన చంద్రబాబు
  • గతంలో మంగమ్మ శపథం చేశాడని విజయసాయి ఎద్దేవా 
  • ఇప్పుడు ఒట్టు తీసి గట్టున పెట్టాడంటూ వ్యంగ్యం

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని బాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడా ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని వెల్లడించారు. ఇక సీఎం కాలేనని చంద్రబాబుకు స్పష్టత వచ్చిందని, కానీ పచ్చ కుల మీడియా మాత్రం పిచ్చిగా చెలరేగుతోందని విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబు ఓటు వేసిన వీడియోను, గతంలో చంద్రబాబు ప్రెస్ మీట్ లో విలపించిన దృశ్యాలను కలిపి ట్విట్టర్ లో పంచుకున్నారు.

  • Loading...

More Telugu News