Vijayasai Reddy: రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు

Vijayasai Reddy gets place into Rajya Sabha Vice Chairman Panel
  • రెండో పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి నేడు ప్రమాణస్వీకారం
  • రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ పునర్ వ్యవస్థీకరణ
  • అవకాశం దక్కడంపై విజయసాయి హర్షం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండో పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు రాజ్యసభ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. కాగా, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ ను పునరుద్ధరించారు. ఈ ప్యానెల్లో తనకు అవకాశం లభించిందని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. 

పునర్ వ్యవస్థీకరించిన వైస్ చైర్మన్ ప్యానెల్లో తనకు అవకాశం దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. తనతో పాటు ప్యానెల్లో చోటు దక్కించుకున్న ఇతర సభ్యులకు శుభాభినందనలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 

కాగా, రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్లో భుభనేశ్వర్ కల్లిటా, తిరుచి సిల్వా, సస్మిత్ పాత్రా, డాక్టర్ ఎల్.హనుమంతయ్య, ఇందు బాలా గోస్వామి ఇతర సభ్యులుగా అవకాశం దక్కించుకున్నారు.
Vijayasai Reddy
Vice Chairman Panel
Rajya Sabha
Venkaiah Naidu
YSRCP
Andhra Pradesh

More Telugu News