పంత్, పాండ్యా మ్యాచ్ లాగేసుకున్నారు: జోస్ బట్లర్

18-07-2022 Mon 10:09
  • తమ బ్యాటింగ్ తీరుపై విచారం వ్యక్తం చేసిన ఇంగ్లండ్ కెప్టెన్
  • తాము తక్కువ పరుగులు చేశామని భావిస్తున్నానని వ్యాఖ్య .  
  • ఇద్దరు వ్యక్తులు మ్యాచ్ మలుపు తిప్పారని కామెంట్
Rishabh Pant Hardik Pandya took the game away Jos Buttler
మూడో వన్డేలో తమ బ్యాటింగ్ తీరు పట్ల ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ విచారం వ్యక్తం చేశాడు. మూడో వన్డేలో త్వరగా 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా విజయతీరాలకు చేర్చడం తెలిసిందే. ముందు నింపాదిగా ఆడిన పంత్, తర్వాత బ్యాటింగ్ తో వీర విహారం చేశాడు. దీంతో మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ తన స్పందన వ్యక్తం చేశాడు.

‘‘మేము తక్కువ పరుగులు చేశామని భావిస్తున్నాను. మాకు బాల్ తో చక్కని ఆరంభం కావాలి. ఆరంభం చక్కగానే ఉంది. మాకంటూ విజయావకాశాలను సృష్టించుకున్నాం. కానీ ఇద్దరు వ్యక్తులు (రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా) మ్యాచ్ ను మా నుంచి తీసేసుకున్నారు. అక్కడే మేము ఓడిపోయాం. బ్యాటింగ్ పట్ల ఆందోళన చెందడం లేదు. టీ20, వన్డేలలో మేము మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేదు. బ్యాట్ తో ఎక్కువ సమయం ఆడాల్సి ఉంది’’ అని బట్లర్ పేర్కొన్నాడు. జోస్ బట్లర్ 60 పరుగులు చేయడంతో తొలుత ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులు చేయగలిగింది.