ముర్ముపై వర్మ వ్యాఖ్యలు... కోర్టుకెక్కిన బీజేపీ కార్యకర్త

  • ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
  • మరి కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు? అన్న వర్మ
  • వర్మ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
  • వర్మపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్
Mumbai man moves to court against RGV

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలవడం తెలిసిందే. ద్రౌపది సరే... పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు? అంటూ వర్మ ట్వీట్లు చేశాడు. కాగా, ఈ ట్వీట్లపై సుభాష్ రాజోరే అనే బీజేపీ కార్యకర్త ముంబయి కోర్టును ఆశ్రయించాడు.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వర్మ తప్పుడు వ్యాఖ్యలు చేశారని సుభాష్ రాజోరే కోర్టుకు తెలిపాడు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేశారని వివరించాడు. వర్మ ట్వీట్లు షెడ్యూల్డ్ కులాల ప్రజలను అగౌరవపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. వర్మపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాడు.

More Telugu News