India: ప్రపంచ అథ్లెటిక్స్​ లో భారత లాంగ్​ జంపర్​ శ్రీశంకర్​కు నిరాశ

India long jumper sree shanker Finishes 7th in world athletics finals
  • ఫైనల్లో ఏడో స్థానంతో సరిపెట్టిన భారత అథ్లెట్
  • పతకం లేకుండానే వెనుదిరిగిన లాంగ్ జంపర్
  • పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ లో  ఫైనల్ చేరలేకపోయిన జాబిర్
అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో భార‌త లాంగ్ జంప్ అథ్లెట్ ముర‌ళీ శ్రీశంక‌ర్‌కు నిరాశ ఎదురైంది. ఈ పోటీల్లో ఫైనల్ కు చేరిన భారత తొలి పురుష లాంగ్ జంపర్ గా చరిత్ర సృష్టించిన శ్రీ శంకర్ పతకం మాత్రం అందుకోలేకపోయాడు.

శనివారం ఉదయం జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో శ్రీశంకర్ ఏడో స్థానంతో సరిపెట్టాడు. కనీసం క్వాలిఫికేషన్ రౌండ్లో అందుకున్న దూరాన్ని కూడా ఫైనల్లో చేరుకోలేకపోయాడు. ఫైనల్లో అన్ని ప్రయత్నాల్లో అత్యధికంగా 7.96 మీటర్ల దూరం మాత్రమే దూకగలిగాడు. 

తన తొలి ప్రయత్నంలోనే ఈ దూరం దూకిన తను తర్వాత అంతకంటే తక్కువ మార్కుకే సరిపెట్టాడు. దాంతో, ఏడో స్థానంలో నిలిచిన శ్రీశంకర్ ప్రపంచ అథ్లెటిక్స్ లో పతకం గెలిచిన భారత తొలి పురుష క్రీడాకారుడిగా నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు. మరోవైపు పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ హీట్స్ లో భారత ఆటగాడు ఎం.పి. జబిర్ 50.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఏడో స్థానంలో నిలిచాడు. దాంతో, అతను ఫైనల్ కు కూడా చేరుకోలేకపోయాడు.
India
athlet
sree shankar
world athletics
longjump

More Telugu News