Telangana: గోదావరి నదికి శాంతి పూజ చేసిన కేసీఆర్... వీడియో ఇదిగో

  • భ‌ద్రాచ‌లం చేరుకున్న కేసీఆర్‌
  • కేసీఆర్‌కు స్వాగ‌తం ప‌లికిన మంత్రి పువ్వాడ అజ‌య్‌
  • మ‌రికాసేప‌ట్లోనే ముగియ‌నున్న కేసీఆర్ వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న‌
kcr inspects flood effected areas by road

గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల నేప‌థ్యంలో తెలంగాణ‌లో నీట మునిగిన వ‌ర‌ద ప్రాంతాల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలిస్తున్నారు. వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న కోసం శ‌నివారం రాత్రికే వ‌రంగ‌ల్ చేరుకున్న కేసీఆర్‌... రాత్రి అక్క‌డే బ‌స చేశారు. ఆదివారం ఉద‌యం వ‌ర‌ద ప్రాంతాల్లో ఆయ‌న ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించాల్సి ఉంది. అయితే ఏరియ‌ల్ స‌ర్వేకు వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. దీంతో సీఎం కేసీఆర్ ఏరియ‌ల్ స‌ర్వేను అధికారులు ర‌ద్దు చేశారు. ఈ క్ర‌మంలో రోడ్డు మార్గ మీదుగానే కేసీఆర్ వ‌ర‌ద ప్రాంతాల ప‌ర్య‌ట‌న మొద‌లైంది.

ఆదివారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతానికి కేసీఆర్ భ‌ద్రాచ‌లం చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ స‌హా అధికారులు స్వాగ‌తం ప‌లికారు. ఆదివారం ఉద‌యం వ‌రంగ‌ల్‌లో బ‌య‌లుదేరిన కేసీఆర్‌ ములుగు, ఏటూరు నాగారం మీదుగా భ‌ద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదికి కేసీఆర్ ప్రత్యేక శాంతి పూజలు చేశారు. నదిలో వరద ప్రవాహాన్ని పరిశీలించారు. మార్గ‌మ‌ధ్యలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తూ సాగిన కేసీఆర్‌... ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌లు, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు. మ‌రికాసేప‌ట్లో వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న‌ను పూర్తి చేయ‌నున్న కేసీఆర్‌... వ‌ర‌ద న‌ష్టంపై అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

More Telugu News