షార్జా నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న విమానం క‌రాచీలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్

  • సాంకేతిక స‌మ‌స్య‌తో క‌రాచీలో ల్యాండ్ అయిన విమానం
  • ప్ర‌యాణికుల కోసం మ‌రో విమానాన్ని పంపుతున్నామ‌న్న ఇండిగో
  • ఈ నెల 5న క‌రాచీలో ల్యాండ్ అయిన స్పైస్‌జెట్ ఫ్లైట్‌
indigo flight enroute from sharjah to hyderabad landed in karachi of pakistan

అర‌బ్ దేశాల నుంచి తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్ బ‌య‌లుదేరిన ఇండిగో విమానం ఉన్న‌ట్టుండి పాకిస్థాన్ న‌గ‌రం క‌రాచీ వైపు మ‌ళ్లింది. నిండా ప్ర‌యాణికుల‌తో షార్జా నుంచి వ‌స్తున్న ఈ విమానంలో ఉన్న‌ట్టుండి సాంకేతిక లోపం త‌లెత్తింది. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త దృష్ట్యా పైల‌ట్ ఆ విమానాన్ని క‌రాచీ వైపు మళ్లించాడు. ఆపై క‌రాచీ ఎయిర్ పోర్టులో విమానాన్ని సుర‌క్షితంగా ల్యాండ్ చేశాడు. 

ఈ ఘ‌ట‌న‌పై ఇండిగో ఎయిర్ లైన్స్ వివ‌ర‌ణ ఇచ్చింది. విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతోనే పైల‌ట్ విమానాన్ని క‌రాచీలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడ‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. క‌రాచీలో దిగిన ప్ర‌యాణికుల కోసం మ‌రో విమానాన్ని పంపుతున్న‌ట్లు ఇండిగో వెల్ల‌డించింది. ఇదిలా ఉంటే... కేవ‌లం రెండు వారాల వ్య‌వ‌ధిలోనే ఇలా భార‌త్‌కు చెందిన‌ విమానం క‌రాచీలో ల్యాండ్ కావ‌డం ఇది రెండో సారి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 5న దుబాయి నుంచి వ‌స్తున్న స్పైస్‌జెట్‌ విమానం కూడా సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా క‌రాచీలో ల్యాండ్ అయిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News