హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డుపై కాల్పుల కలకలం.. కారులో వచ్చి లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన దుండగుడు
- మెదక్ నుంచి ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ
- తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్ద కాల్పులు
- గురితప్పడంతో ప్రాణాలతో బయటపడిన మనోజ్
- నిందితుడి కోసం మూడు బృందాల గాలింపు
లారీ డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, ఔటర్ రింగ్‌రోడ్డుపై గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు జరిగాయి. విలువైన సరుకును రవాణా చేసే లారీలు, కంటెయినర్లను లక్ష్యంగా చేసుకుంటున్న దొంగలు.. డ్రైవర్లను బెదిరించడమో, హత్య చేయడం ద్వారానో వాటిలోని సరుకును అపహరిస్తున్నారు. లారీ టైర్లు, సబ్బులతో వెళ్తున్న లారీలను అడ్డగించి దోచుకున్న ముఠాకి ఇటీవల రాచకొండ పోలీసులు సంకెళ్లు వేశారు. కాగా, లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన నిందితుడు వరంగల్‌వైపు పరారై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.