Nagashourya: 'ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి' నుంచి అప్ డేట్!

Phalana Abbayi Phalana Ammayi movie update
  • నాగశౌర్య నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టయినర్ 
  • ఆయన సరసన నాయికగా మాళవిక నాయర్
  • దర్శకత్వం వహించిన అవసరాల శ్రీనివాస్  
  • ఇంగ్లాండ్ షెడ్యూల్ తో షూటింగు పూర్తి

నాగశౌర్య - మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రూపొందింది. పీపుల్ మీడియా .. దాసరి ప్రొడక్షన్స్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఇంగ్లాండులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా అక్కడ ఈ టీమ్ తీసుకున్న ఫొటోస్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. 'జ్యో అచ్యుతానంద' తరువాత అవసరాల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇక మాళవిక నాయర్ విషయానికి వస్తే, 'ఎవడే సుబ్రమణ్యం' నుంచి ఆమె తెలుగులో చేస్తూ వస్తోంది .. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది.

చైతూ సరసన ఆమె చేసిన 'థ్యాంక్యూ' ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత 'అన్నీ మంచి శకునములే' లైన్లోనే ఉంది. ఇక నాగశౌర్యకి కొంతకాలంగా హిట్ లేదు. రిలీజ్ కి ఒక సినిమా రెడీగా ఉండగా, ఆయన లైన్లో పెడుతున్న మరో సినిమా ఇది. ఈ సినిమాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.

  • Loading...

More Telugu News