Narendra Modi: ఓట్ల కోసం ఇచ్చే 'ఉచిత' హామీల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని నరేంద్ర మోదీ

  • ఉత్తరప్రదేశ్ లో మోదీ పర్యటన
  • సీఎం యోగితో కలిసి బుందేల్ ఖండ్ హైవే ప్రారంభం
  • 'ఉచిత' హామీలు అత్యంత ప్రమాదకరం అని వెల్లడి
  • తాయిలాల సంస్కృతిని పారదోలాలని పిలుపు
Modi comments on politics

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి 296 కిలోమీటర్ల బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓట్ల కోసం ఇచ్చే 'ఉచిత' హామీల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి 'ఉచిత' హామీలు ప్రగతి నిరోధకాలు అని, దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరం అని వివరించారు.

ఉచిత తాయిలాలు పంచిపెట్టి ఓట్లు సంపాదించుకునే సంస్కృతికి అడ్డుకట్ట పడాలని మోదీ అభిలషించారు. ఇలాంటి 'ఉచిత' హామీలు ఇచ్చేవాళ్లు ఎక్స్ ప్రెస్ హైవేలు, ఎయిర్ పోర్టులు, రక్షణ రంగ కారిడార్లు ఎప్పటికీ నిర్మించలేరని స్పష్టం చేశారు. మనం కలిసికట్టుగా ఇలాంటి తాయిలాల సంస్కృతిని దేశం నుంచి, రాజకీయాల నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తూ, దేశ భవిష్యత్ ను నిర్మిస్తోందని మోదీ ఉద్ఘాటించారు.

More Telugu News