Botsa Satyanarayana: విదేశీ విద్య పథకానికి జగనన్న పేరు పెడితే తప్పేముంది?: మంత్రి బొత్స సత్యనారాయణ

Not a single school is closes in AP says Botsa Satyanarayana
  • రాష్ట్రంలో ఒక్క పాఠశాలను కూడా మూసివేయలేదన్న మంత్రి 
  • విద్యార్థుల సంఖ్య 150 దాటితేనే హెడ్మాస్టర్ ను నియమిస్తామని వెల్లడి 
  • 270 స్కూళ్లలో విలీన సమస్య ఉన్నట్టు గుర్తించామన్న బొత్స  
ఏపీలో ఒక్క పాఠశాలను కూడా మూసివేయలేదని... ఎక్కడైనా పాఠశాల మూతపడి ఉంటే విద్యా మంత్రిగా బాధ్యత స్వీకరిస్తానని బొత్స సత్యనారాయణ అన్నారు. మూడు, నాలుగు, ఐదో తరగతుల విలీనం తర్వాత ఫౌండేషన్ స్కూళ్లను తీసుకొస్తామని చెప్పారు. 270 స్కూళ్లలో విలీన సమస్య ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఏయే స్కూళ్లలో సమస్య ఉందో తెలపాలని ఎమ్మెల్యేలను కోరామని చెప్పారు. 

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితేనే హెడ్మాస్టర్ ను నియమిస్తామని తెలిపారు. విద్యార్థుల సంఖ్య 21 దాటితేనే మరో ఎస్టీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామని చెప్పారు. విదేశీ విద్య పథకానికి జగనన్న పేరు పెడితే తప్పేముందని ప్రశ్నించారు. అయినా, ఈ విషయంలో మరోసారి పరిశీలిస్తామని మంత్రి చెప్పారు.  

విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో గతుకులు పడిన 20 రోడ్లను గుర్తించామని బొత్స చెప్పారు. రోడ్ల మరమ్మతులకు రూ. 93 కోట్లతో టెండర్లు పిలుస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 27 రోడ్లను గుర్తించామని, ఆర్ అండ్ బీ పరిధిలో 50 కిలోమీటర్ల రోడ్డు పాడైనట్టు గుర్తించామని చెప్పారు. వీటన్నింటికి టెండర్లను పిలుస్తామని తెలిపారు.
Botsa Satyanarayana
YSRCP
Schools

More Telugu News