Janasena: తూర్పు గోదావరిలో జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం

janasena koulu raithu bharosa yatra starts in east godavari disrtict
  • రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి ప‌వ‌న్ యాత్ర ప్రారంభం
  • కౌలు రైతు శంక‌రం కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్‌
  • ఆత్మ‌హ‌త్య చేసుకున్న శంక‌రం ఫొటోకు నివాళి అర్పించిన వైనం
  • బాధిత కుటుంబానికి రూ.1 ల‌క్ష అంద‌జేత‌
సాగు కలిసి రాక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు అండ‌గా నిలిచేందుకు ఉద్దేశించిన జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర శ‌నివారం ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో ప్రారంభ‌మైంది. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి రాజ‌మ‌హేంద్రవ‌రం చేరుకుని న‌గ‌రం నుంచే యాత్ర ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ కౌలు రైతు పచ్చిమళ్ళ శంకరం కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. శంక‌రం ఫొటోకు నివాళి అర్పించిన ప‌వ‌న్‌... ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. అనంత‌రం జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌లో ప్ర‌క‌టించిన రూ.1 ల‌క్ష‌ను ఆయ‌న బాధిత కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేశారు.
Janasena
Pawan Kalyan
East Godavari District
Rajamahendravaram

More Telugu News