Reliance Jio: హెచ్ పీ స్మార్ట్ సిమ్ ల్యాప్ టాప్ పై జియో 100జీబీ డేటా ఫ్రీ

Reliance Jio announces HP Smart SIM Laptop with free 100GB data
  • కొత్త ఆఫర్ ను ప్రకటించిన జియో
  • ఏడాది పాటు అమల్లో ఉండనున్న ఉచిత డేటా
  • ఆ తర్వాత 64 కేబీపీఎస్ కు పడిపోనున్న డేటా వేగం
హెచ్ పీ స్మార్ట్ సిమ్ ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి గుడ్ న్యూస్. జియో నుంచి 100 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. అది కూడా ఏడాది కాల పరిమితితో. ఈ డేటాతో జియో డిజిటల్ లైఫ్ ను యూజర్లు ఆనందించొచ్చని రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ ఉచిత డేటా కోసం యూజర్లు జియో హెచ్ పీ స్మార్ట్ సిమ్ కలిగి ఉండాలి.

హెచ్ పీ కంపెనీకి చెందిన కొన్ని ల్యాప్ టాప్ మోడళ్ల కొనుగోలుపై ఈ 100 జీబీ ఉచిత డేటా ప్యాక్ అమల్లో ఉంటుంది. ల్యాప్ టాప్ కొనుగోలు తో పాటు వచ్చే ఉచిత జియో సిమ్ ను యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఉచిత జియో డేటా ప్యాక్ అమల్లోకి వస్తుంది. ఈ పరిమితి దాటిన తర్వాత డేటా వేగం 64 కేబీపీఎస్ కు తగ్గిపోతుంది. అప్పుడు జియో ప్యాక్ ల నుంచి రీచార్జ్ చేసుకోవాలి. 

రిలయన్స్ డిజిటల్ స్టోర్ కు వెళ్లి ల్యాప్ టాప్ కొనుగోలు చేస్తుంటే, 100 జీబీ ఉచిత డేటా ప్యాక్ యక్టివేట్ చేయాలని అడగాలి. ఆన్ లైన్ లో అయితే రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్, హెచ్ పీ స్మార్ట్ ల్యాప్ టాప్ పోర్టళ్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
Reliance Jio
HP
data offer
Smart SIM Laptop

More Telugu News