Telangana: నువ్వెంత‌?.. నీ స్థాయి ఎంత‌? అంటూ కేటీఆర్‌పై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫైర్‌

congress mp uttam kumar reddy fires on ktr comments on rahul gandi
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌దే విజ‌యమ‌న్న ఉత్త‌మ్‌
  • రాహుల్ గాంధీపై మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు ఉందా అని ప్ర‌శ్న‌
  • శ్రీలంక‌లో రాజ‌పక్సకు ప‌ట్టిన గ‌తే కేసీఆర్‌కు త‌ప్ప‌ద‌ని జోస్యం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ కీల‌క నేత‌, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హ‌త కేటీఆర్‌కు ఉందా? అని ఉత్త‌మ్ మండిప‌డ్డారు. ఈ మేర‌కు శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా కేటీఆర్ వ్య‌వ‌హార స‌ర‌ళిపై ఉత్త‌మ్ విరుచుకుప‌డ్డారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌దే విజ‌య‌మ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్య‌లు అహంకార‌పూరిత‌మైన‌వేన‌ని ఆయ‌న అన్నారు. కేటీఆర్ ఎంత‌?... ఆయ‌న స్థాయి ఎంత? అని కూడా ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు. శ్రీలంక‌లో రాజ‌ప‌క్స కుటుంబానికి ప‌ట్టిన గ‌తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ కుటుంబానికి త‌ప్ప‌ద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు.
Telangana
Congress
TRS
KCR
KTR
Uttam Kumar Reddy

More Telugu News