అఖిల్ మెరుపుదాడి: 'ఏజెంట్' నుంచి టీజర్ రిలీజ్

  • 'ఏజెంట్'గా కనిపించనున్న అఖిల్ 
  • కథానాయికగా సాక్షి వైద్య పరిచయం
  • కీలకమైన పాత్రలో మమ్ముట్టి
  • ఐదు భాషల్లో విడుదల కానున్న సినిమా
Agent teaser released

అఖిల్ తాజా చిత్రంగా 'ఏజెంట్' రూపొందింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ తో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. మొదటి నుంచి కూడా ఆయన లుక్ ఆసక్తిని పెంచుతూ వస్తోంది. ఇంతవరకూ అఖిల్ చేసిన సినిమాలకి .. ఈ సినిమాకి తేడా చూపిస్తూ రావడంలో సక్సెస్ అయ్యారు. 

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. అఖిల్ పాత్రను హైలైట్ చేస్తూ .. ఆయన యాక్షన్ సీన్స్ పై ఫోకస్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించినట్టు .. అందుకోసం భారీగానే ఖర్చు చేసినట్టుగా అర్థమవుతోంది. అఖిల్ సిక్స్ ప్యాక్ .. వీపుపై టాటూను కూడా హైలైట్ చేశారు. 

ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా సాక్షి వైద్య పరిచయమవుతోంది. కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. హిప్ హాఫ్ తమిళ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. వక్కంతం వంశీ కథను అందించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

More Telugu News