Patiala Court: ఆల్ట్ న్యూస్ వ్య‌వ‌స్థాప‌కుడు జుబైర్ కు బెయిల్ మంజూరు

Delhi court grants bail to Alt News co founder MohammadZubair
  • వివాదాస్ప‌ద ట్వీట్ కేసులో జుబైర్ అరెస్ట్‌
  • బెయిల్ కోసం పాటియాలా హౌజ్ కోర్టులో పిటిష‌న్‌
  • బెయిల్ ఇవ్వ‌రాద‌న్న ప్ర‌భుత్వ వాద‌న‌ల‌ను తోసిపుచ్చిన కోర్టు
వివాదాస్పద ట్వీట్ చేశారంటూ అరెస్ట్ అయిన ఆల్ట్ న్యూస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌హ్మ‌ద్ జుబైర్‌కు ఎట్ట‌కేల‌కు బెయిల్ ద‌క్కంది. త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ జుబైర్ దాఖ‌లు చేసుకున్న పిటిష‌న్‌పై ఇప్ప‌టికే రెండు పర్యాయాలు విచార‌ణ చేప‌ట్టిన ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు తాజాగా శుక్ర‌వారం మ‌రోమారు విచార‌ణ చేప‌ట్టింది. 

తాజా విచార‌ణ సందర్భంగా జుబైర్‌, ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాదుల వాద‌న‌లు విన్న కోర్టు జుబైర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. జుబైర్‌కు బెయిల్ ఇవ్వ‌రాదన్న ప్ర‌భుత్వ వాద‌న‌ను కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. విచార‌ణ‌కు తాను పూర్తిగా స‌హ‌కరిస్తాన‌న్న జుబైర్ త‌ర‌ఫు వాద‌న‌ల‌పై విశ్వాసం వ్య‌క్తం చేసిన కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది.
Patiala Court
Alt News
Mohammed Zubair

More Telugu News