Elon Musk: 35 ఏళ్ల సవతి కూతురుతో రెండో బిడ్డను కన్న 76 ఏళ్ల ఎలాన్ మస్క్ తండ్రి

Elon Musks Father 76  Has  Secret  Child With 35 Year Old Stepdaughter
  • రెండో భార్య కుమార్తెతో ఇది వరకే ఒక బాబు
  • ఇప్పుడు మరో బిడ్డకు జన్మనిచ్చినట్టు చెప్పిన ఎరోల్ మస్క్
  • తన కుటుంబానికి ఇది గగుర్పాటు కలిగించే విషయమేనన్న మస్క్ తండ్రి
  • ఈ భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమేనంటూ వ్యాఖ్యలు
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తండ్రి 76 ఏళ్ల ఎరోల్ మస్క్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 35 ఏళ్ల సవతి కూతురు జానా బెజుయిడెన్‌హౌట్‌తో తాను రహస్యంగా రెండో బిడ్డను కన్నట్టు చెప్పి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ‘ది సన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. 

‘‘మనం ఈ భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమే’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దక్షిణాఫ్రికాలో ఇంజినీర్ అయిన ఎరోల్ మస్క్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రణాళిక లేకుండానే రెండో బిడ్డకు జన్మనిచ్చామని, 2019లో జన్మించిన ఆ బిడ్డ ప్రస్తుతం జానాతోనే ఉన్నట్టు తెలిపారు.  

తమకు 2017లో బాబు ఇలియట్ రష్ జన్మించాడని, ఇప్పుడతడి వయసు ఐదేళ్లని ఎరోల్ మస్క్-జానా ఇటీవల ప్రకటించారు. ఎలాన్ మస్క్‌తో కలుపుకుని ఎరోల్‌కు ఇప్పుడు ఏడుగురు సంతానం. 1979లో ఎలాన్ మస్క్ తల్లి మాయే హాల్డెమాన్‌తో విడిపోయిన తర్వాత హేడే బెజుడెన్‌హౌట్‌ను ఎరోల్ మస్క్ రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమార్తే జానా బెజుడెన్‌హౌట్. మొదటి భార్య మాయే ద్వారా ఎరోల్ మస్క్‌కు ముగ్గురు పిల్లలు ఎలోన్ మస్క్, కింబాల్, టోస్కా ఉన్నారు. ఎరోల్ మస్క్‌కు హేడే ద్వారా ఇద్దరు పిల్లలు జన్మించారు. 

కాగా, ఎరోల్ ద్వారా జానా గర్భం దాల్చిన విషయం తెలిసి కుటుంబం షాక్‌లోకి వెళ్లిపోయింది. ఇదే విషయమై ఎరోల్ మస్క్ ఆ ఇంటర్వ్యూలో చెబుతూ.. వారు ఇప్పటికీ దీనిని ఇష్టపడరని, వారికిది కొంచెం గగుర్పాటు కలిగించే విషయమేనని అన్నారు. ఏదిఏమైనా ఆమె వారి సోదరి   అని ఆయన పేర్కొన్నారు.
Elon Musk
Errol Musk
Stepdaughter
Jana Bezuidenhout

More Telugu News