అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి భార్య కన్నుమూత

  • 1977లో ఇవానాను వివాహం చేసుకున్న ట్రంప్
  • 1992లో విడాకులు తీసుకున్న వైనం
  • ఇవానా మృతికి కారణాలు వెల్లడించని కుటుంబ సభ్యులు
Ivana Trump first wife of Donald Trump dies

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ మరణించారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఇవానా వయసు 73 సంవత్సరాలు. ఇవానా మృతి విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రకటించారు. న్యూయార్క్‌లోని తన స్వగృహంలోనే ఆమె మరణించారని, ఎంతో బాధతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో పోస్టు చేశారు.

ఇవానా ట్రంప్‌ను డొనాల్డ్ ట్రంప్ 1977లో వివాహం చేసుకున్నారు. 1992లో విడాకులు తీసుకున్నారు. వీరికి డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ ముగ్గురు సంతానం.  కాగా, ఆమె మరణానికి కారణం ఏంటన్నది మాత్రం కుటుంబం వెల్లడించలేదు.

More Telugu News