Aadil Chisthi: హిందూ దేవతలపై అజ్మీర్ దర్గా మతప్రబోధకుడి అనుచిత వ్యాఖ్యలు

Aadil Chishti insults Hindus over animal Gods
  • హిందువులకు 33 కోట్ల మంది దేవుళ్లా? అన్న అదిల్ చిస్తీ
  • సగం మనిషి, సగం జంతువు అయిన వినాయకుడు, హనుమంతుడు కూడా దేవుళ్లేనా? అని ప్రశ్న
  • ఆయనపై చర్యలు తీసుకోవాలన్న హిందూ సంస్థలు
  • క్షమించాలంటూ వేడుకున్న అదిల్ చిస్తీ
అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ సర్వర్ చిస్తీ కుమారుడు అదిల్ చిస్తీ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హిందువులకు 33 కోట్లమంది దేవుళ్లు ఎలా ఉంటారని ఆశ్చర్యం వ్యక్తం చేసిన అదిల్.. అదసలు సాధ్యమేనా? అని ప్రశ్నించారు.

అంతేకాదు సగం మనిషి, సగం జంతువులా ఉండే వినాయకుడు, హనుమంతుడు కూడా దేవుళ్లేనా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

తన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో అదిల్ స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని అన్నారు. నుపుర్ శర్మను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశానంటూ మరో వీడియోను విడుదల చేశారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు అయినా గాయపడి ఉంటే తనను క్షమించాలని కోరారు. 

మరోవైపు, విద్వేష ప్రసంగం చేసి పరారీలో ఉన్న గౌహర్ చిస్తీని రాజస్థాన్ పోలీసులు నిన్న హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నుపుర్‌శర్మ తల తెచ్చి ఇచ్చిన వారికి తన ఇంటిని రాసిస్తానన్న అదే దర్గాకు చెందిన సయ్యద్ సల్మాన్ చిస్తీ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
Aadil Chisthi
Hindus
Animal God
Ajmer
Nupur Sharma

More Telugu News