NSE: ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్రా రామ‌కృష్ణ‌ను అరెస్ట్ చేసిన ఈడీ

ed arrests nse ex boss Chitra Ramkrishna
  • ఎన్ఎస్ఈలో అవ‌క‌త‌వ‌క‌లపై సీబీఐ కేసు
  • ఏడాది క్రితం చిత్రాను అరెస్ట్ చేసిన సీబీఐ
  • సీబీఐ కేసు ఆధారంగా చిత్రాపై ఈడీ కేసు న‌మోదు
నేష‌న‌ల్ స్టాక్ ఎక్సేంజి (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామ‌కృష్ణ‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) గురువారం అరెస్ట్ చేసింది. ఎన్ఎస్ఈ అవ‌క‌త‌వ‌క‌ల వ్య‌వ‌హారంలో ఏడాది క్రిత‌మే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్ల‌ను ట్యాప్ చేసి త‌న‌కు అనుకూలంగా ఉన్న కంపెనీల‌కు ల‌బ్ధి చేకూరేలా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై చిత్రాపై సీబీఐ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. సీబీఐ న‌మోదు చేసిన కేసు ఆధారంగా తాజాగా ఈడీ కూడా ఆమెపై కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో ఆమెను గురువారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
NSE
Enforcement Directorate
CBI
Chitra Ramkrishna

More Telugu News