Jagan: సీఎం జగన్ ను కలిసిన ఐఏఎస్ లుగా పదోన్నతి పొందిన డిప్యూటీ కలెక్టర్లు

Deputy Collectors promoted as IAS officers meets CM Jagan
  • ఐఏఎస్ లుగా పదోన్నతి పొందిన ఎనిమిది మంది డిప్యూటీ కలెక్టర్లు
  • సీఎం కార్యాలయంలో జగన్ ను కలిసిన అధికారులు
  • సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన అధికారులు
ఐఏఎస్ లుగా పదోన్నతి పొందిన డిప్యూటీ కలెక్టర్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని గౌరవపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసిన వారిలో బి.సుబ్బారావు (డీఆర్వో, తూర్పుగోదావరి), జే. శివ శ్రీనివాసు (అసిస్టెంట్‌ సెక్రటరీ – సీసీఎల్‌ఏ), పి. శ్రీనివాసులు (డీఆర్వో, ప్రకాశం), బి. శ్రీనివాసరావు (సీఈవో, రైతుబజార్లు), ఆర్‌. గోవిందరావు (ఆర్డీవో, నర్సీపట్నం), ఎన్‌. తేజ్‌ భరత్‌ (జాయింట్‌ సెక్రటరీ, సీసీఎల్‌ఏ), డి. హరిత (ఆర్డీవో, శ్రీకాళహస్తి), ఎస్‌. చిన్న రాముడు ( స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్, ఎల్‌ఏ) ఉన్నారు. వీరందరూ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు, ఐఏఎస్ లుగా పదోన్నతి పొందిన వీరిని ముఖ్యమంత్రి అభినందించారు.
Jagan
YSRCP
Deputy Collectors
Promotion
IAS

More Telugu News