TMC: నిన్న పానీ పూరీ, నేడు పిండి వంట‌ల త‌యారీ!... బెంగాల్ సీఎం దీదీ వీడియో ఇదిగో!

West Bengal CM Mamata Banerjee prepared momos at a local stall in Darjeeling
  • డార్జిలింగ్ ప‌ర్య‌ట‌న‌లో దీదీ
  • మోమోలు త‌యారు చేసిన సీఎం
  • బుధ‌వారం పానీ పూరీలు పంచుతూ క‌నిపించిన వైనం
రాజ‌కీయాల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఫెరోషియ‌స్‌గా క‌నిపిస్తారు. వైరివ‌ర్గాల‌పై ప‌దునైన మాట‌ల‌తో విరుచుకుప‌డే దీదీ... తాను తీసుకునే నిర్ణ‌యాల్లోనూ దూకుడు ప్ర‌దర్శిస్తారు. అయితే గ‌డ‌చిన రెండు రోజులుగా ఆమె త‌న స‌హ‌జ వైఖరికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. ఈ దిశ‌గా గురువారం దీదీకి చెందిన రెండో వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

బుధ‌వారం వీధుల్లో ఉండే పానీ పూరీ బండ్ల వ‌ద్ద నిలిచిన దీదీ... జ‌నానికి పానీ పూరీలు అందిస్తూ క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమె డార్జిలింగ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పిండి వంట‌ల త‌యారీలో నిమ‌గ్న‌మై కనిపించారు. డార్జిలింగ్‌లోని ఓ పిండి వంటకాల తయారీ కేంద్రంలో కూర్చుని అక్కడి సంప్ర‌దాయ పిండి వంట‌కం మోమోలను త‌యారు చేశారు. పొయ్యి ముందు పీట‌పై కూర్చుని మోమోల‌ను త‌యారు చేస్తున్న దీదీ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.
TMC
West Bengal
Mamata Banerjee
Momos
Darjeeling

More Telugu News