Bollywood: తనకు భార్యగా ఉంటే నెలకు రూ. 25 లక్షలు ఇస్తానని ఓ వ్యాపారవేత్త ఆఫర్ చేశాడంటున్న బాలీవుడ్ నటి నీతూ చంద్ర

 A businessman offered me Rs 25 lakh for month says Neetu Chandra
  • ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన నీతూ చంద్ర
  • ప్రస్తుతం తనకు పనీ లేదూ, డబ్బూ లేదని ఆవేదన
  • అనవసరంగా ఇక్కడ ఉన్నానేమోనన్న నటి
  • తనది సక్సెస్‌ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ అంటూ ఆవేదన
బాలీవుడ్ నటి నీతూచంద్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు శాలరీడ్ వైఫ్ (వేతనం తీసుకుని భార్యగా ఉండడం)గా ఉంటే నెలకు రూ. 25 లక్షలు ఇస్తానని ఓ పెద్ద వ్యాపారవేత్త తనకు ఆఫర్ చేశాడని పేర్కొంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. 

13 జాతీయ అవార్డులు గెలుచుకున్న వారితో పనిచేసినప్పటికీ తనకిప్పుడు చేతిలో పనిలేదని, తన వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ ఆడిషన్ సందర్భంగా పేరున్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ తనను ఓ గంటలోనే రిజక్ట్ చేశాడని చెప్పుకొచ్చింది. 

2005లో ‘గరం మసాలా’ సినిమాతో నీతూ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అందులో ఆమె ఎయిర్‌హోస్టెస్ పాత్ర పోషించింది. ఆ తర్వాత  ట్రాఫిక్ సిగ్నల్, వన్ టూ త్రీ, ఓయ్ లక్కీ లక్కీ ఓయ్, అపార్ట్‌మెంట్, 13బి వంటి చిత్రాలలో నటించింది. షెఫాలీ షా, రాహుల్ బోస్, సుమీత్ రాఘవన్‌లతో కలిసి చివరిసారి కుచ్ లవ్ జైసా సినిమాలో కనిపించింది. ఆమె నటించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ సినిమా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. నీతూ చిత్రం మిథిలా మఖాన్ కూడా జాతీయ అవార్డు అందుకుంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నా కథ సక్సెస్ ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ (మేరీ స్టోరీ ఏక్ సక్సెస్ ఫుల్ యాక్టర్ కి ఫెయిల్యూర్ స్టోరీ హై). 13 మంది జాతీయ అవార్డు గ్రహీతలతో, పెద్ద సినిమాల్లో పనిచేసిన నాకు ఈ రోజు పని లేదు. ఒక పెద్ద వ్యాపారవేత్త నాకు నెలకు  రూ. 25 లక్షలు ఇస్తానని, జీతం తీసుకుని భార్యగా ఉండాలని కోరాడు. నా దగ్గర డబ్బూ లేదు, పనీ లేదు. ఇన్ని మంచి సినిమాల్లో నటించాక కూడా నేను ఇక్కడ అనవసరంగా ఉన్నానేమో అని అనిపిస్తోంది’’ అని నీతూ చంద్ర ఆవేదన వ్యక్తం చేసింది.
Bollywood
Neetu Chandra
Garam Masala
Traffic Signal

More Telugu News