President Of India: ఢిల్లీలో దుబ్బాక ఎమ్మెల్యే... రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌పై బీజేపీ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు

dubbak mla raghunandan rao attends bjp classes on president of india elections
  • ఈ నెల 18న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌
  • ఢిల్లీలో బీజేపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు
  • ఫొటోల‌ను పంచుకున్న ర‌ఘునంద‌న్ రావు
భారత రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. ఈ ఎన్నిక‌ల్లో ఎంపీల‌తో పాటు అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంది. ఈ నెల 18న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్ ఢిల్లీ స‌హా అన్ని రాష్ట్రాల రాజ‌ధానుల్లో జరుగుతుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం... ఇప్ప‌టికే బ్యాలెట్ బాక్సుల‌ను ఆయా రాష్ట్రాల‌కు పంపింది. 

ఇలాంటి స‌మ‌యంలో అధికార ఎన్డీఏ కూట‌మికి నేతృత్వం వ‌హిస్తున్న బీజేపీ... రాష్ట్రప‌తి ఎన్నికల్లో ఓటు ఎలా వేయాల‌న్న దానిపై త‌న ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు బుధ‌వారం శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించింది. డిల్లీలో జ‌రిగిన ఈ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు బీజేపీ ఎంపీల‌తో పాటు ఆ పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. అందులో భాగంగా తెలంగాణ‌లోని దుబ్బాక ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న మాధ‌వ‌నేని ర‌ఘునంద‌న్ రావు కూడా ఈ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యారు. శిక్ష‌ణా త‌ర‌గ‌తుల ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.
President Of India
President Of India Electiona
BJP
NDA
Dubbak MLA
Raghunandan Rao

More Telugu News