Andhra Pradesh: కుప్పంలో చంద్ర‌బాబుతో రాజీనామా చేయించి మ‌ళ్లీ పోటీ చేయించి గెలవ‌మ‌ని స‌వాల్ విసురుతున్నా: కొడాలి నాని

ysrcp mla kodali nani challenge to tdp
  • జ‌గ‌న్ గ్రాఫ్ త‌గ్గుతోందంటూ విడుద‌లైన స‌ర్వేపై నాని ఆగ్ర‌హం
  • కుప్పంలో చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌లో ఎవ‌రు పోటీ చేసినా ఓకేనంటూ స‌వాల్‌
  • స‌ర్వే సంస్థ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ ఓ వీడియోనూ జ‌త చేసిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో విప‌క్ష టీడీపీకి అధికార వైసీపీకి చెందిన కీల‌క నేత, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ స‌వాల్ విసిరారు. 'కుప్పంలో చంద్ర‌బాబుతో రాజీనామా చేయించి మ‌ళ్లీ పోటీ చేయించి గెలవ‌మ‌ని స‌వాల్ విసురుతున్నాను' అంటూ ఆయ‌న టీడీపీకి స‌వాల్ విసిరారు. అంతేకాకుండా కుప్పంలో చంద్ర‌బాబు రాజీనామా త‌ర్వాత ఆయ‌న పోటీ చేసినా, లేదంటే ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ పోటీ చేసినా త‌మ‌కు ఓకేనంటూ నాని స‌వాల్ విసిరారు.

ఏపీలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ క్ర‌మంగా త‌గ్గుతోందంటూ బుధ‌వారం ఓ స‌ర్వే విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ర్వేపై వైసీపీ నేత‌లు వ‌రుస‌గా స్పందిస్తున్నారు. అందులో భాగంగానే కొడాలి నాని కూడా ఈ స‌ర్వేను ఆధారం చేసుకునే టీడీపీకి స‌వాల్ విసిరారు. బోగ‌స్ స‌ర్వే చూసుకుని మురిసిపోతున్న దుష్ట‌చ‌తుష్ట‌యానికి, దాన్ని అచ్చేసిన మీడియాకి ఓపెన్ చాలెంజ్ అంటూ నాని స‌వాల్ విసిరారు. ఈ మేర‌కు బుధ‌వారం రాత్రి చేసిన త‌న ట్వీట్‌కు ఆ స‌ర్వే నిర్వ‌హించిన సంస్థ ఎవ‌రిద‌న్న వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ ఆయ‌న ఓ వీడియోను కూడా జ‌త చేశారు.
Andhra Pradesh
TDP
YSRCP
Kodali Nani
Chandrababu
Nara Lokesh
YS Jagan

More Telugu News