Team India: ఇంగ్లండ్‌లోనే ధోనీ!... విండీస్ దిగ్గ‌జంతో క‌లిసి నిన్న‌టి వ‌న్డే మ్యాచ్ వీక్ష‌ణ‌!

ms dhoni spotted at the oval stadium in england with Gordon Greenidge
  • చాలా రోజుల క్రిత‌మే ఇంగ్లండ్ టూర్ వెళ్లిన ధోనీ
  • బ‌ర్త్ డే వేడుక‌ల‌ను కూడా అక్క‌డే జ‌రుపుకున్న వైనం
  • నిన్న‌టి మ్యాచ్‌ను గార్డ‌న్ గ్రీనిడ్జ్‌తో క‌లిసి వీక్షించిన కెప్టెన్ కూల్‌
  • సైఫ్ అలీ ఖాన్‌, క‌రీనా క‌పూర్ దంప‌తులూ ధోనీకి జ‌త క‌లిసిన వైనం
టీమిండియా మాజీ ఆట‌గాడు, మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఇంగ్లండ్ టూర్ ఇప్పుడ‌ప్పుడే ముగిసేలా లేదు. త‌న జ‌న్మ‌దినాన్ని కూడా ఇంగ్లండ్‌లోనే జ‌రుపుకున్న ధోనీ... ఇంగ్లండ్ జ‌ట్టుతో టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌ల‌ను వ‌రుస‌బెట్టి ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తూ సాగుతున్నాడు. తాజాగా మంగ‌ళ‌వారం ఇంగ్లండ్‌తో భార‌త జ‌ట్టు ఆడిన తొలి వ‌న్డే మ్యాచ్‌ను కూడా ధోనీ ప్ర‌త్య‌క్షంగానే వీక్షించాడు. క్రికెట్ దిగ్గ‌జం, వెస్టిండిస్ మాజీ ఆట‌గాడు గార్డన్ గ్రీనిడ్జ్‌తో క‌లిసి ధోనీ నిన్నటి మ్యాచ్‌ను వీక్షించారు.

ఈ సంద‌ర్భంగా గ్రీనిడ్జ్‌తో ధోనీ దిగిన ఫొటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ఫొటోలో బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. సైఫ్ అలీ ఖాన్‌, అత‌డి భార్య క‌రీనా క‌పూర్‌, గ్రీనిడ్జ్‌ల‌తో క‌లిసి ధోని నిన్న‌టి మ్యాచ్‌ను వీక్షించాడ‌ట‌. ఇంగ్లండ్‌తో టీమిండియా టీ20 సిరీస్ చివ‌రి మ్యాచ్‌లోనూ క‌నిపించిన ధోనీ...ఇంగ్లండ్ వేదిక‌గా ఇటీవ‌లే ముగిసిన వింబుల్డ‌న్ మ్యాచ్‌ల్లోనూ త‌ళుక్కున మెరిసిన సంగ‌తి తెలిసిందే.
Team India
England
MS Dhoni
Gordon Greenidge
Saif Ali Khan
Kareena Kapoor

More Telugu News