ఉత్తమ రచయిత్రిగా మంత్రి రోజా కుమార్తె అన్షు మాలిక... రోజా పుత్రికోత్సాహం
- అన్షు మాలికకు జీ టౌన్ మ్యాగజైన్ అవార్డు
- సౌత్ ఇండియా నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం
- కోల్ కతాలో అవార్డుల ప్రదానోత్సవం
- బాలీవుడ్ నటి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అన్షు
రోజా కుమార్తె అన్షుమాలిక రచయిత్రిగా, యూట్యూబర్ గా, యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా రాణిస్తోంది. గతంలో అన్షు మాలిక యంగ్ సూపర్ స్టార్ అవార్డు దక్కించుకోగా, ఇన్ ఫ్లుయెన్సర్-యూకే మ్యాగజైన్ పై ఆమె ఫొటోను కవర్ పేజీగా ప్రచురించారు.
అంతేకాదు, బోర్న్ అచీవర్ మ్యాగజైన్ పైనా క్వీన్ ఆఫ్ టాలెంట్ అంటూ అన్షు మాలిక ముఖచిత్రాన్ని వేశారు. అన్షు మాలిక సామాజిక సేవలోనూ ముందంజ వేస్తోంది. హైదరాబాద్ లో చీర్స్ ఫౌండేషన్ ద్వారా ఐదుగురు పిల్లలను చదివిస్తున్నట్టు మంత్రి రోజా ఇటీవల తన కుమార్తె గురించి చెప్పారు.