పూర్తి పారదర్శకతతో వచ్చిన ప్రపంచంలో మొదటి ఫోన్... ‘నథింగ్ ఫోన్ (1)’

  • మూడు వేరియంట్లలో విడుదల
  • రూ.32,999-38,999 మధ్య ధరలు
  • హెచ్ డీఎఫ్ సీ కార్డు చెల్లింపులపై రూ.2,000వేల డిస్కౌంట్
  • ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్లు
Nothing Phone  launched in India with starting price of Rs 32999 open sale begins on July 21

ఏ ఫోన్ అయినా లోపల ఏముందో బయటకు తెలియదు. గతంలో అయితే తొలగించే బ్యాటరీలతో వచ్చినప్పుడు వెనుక ప్యానెల్ కొంత చూసే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అన్నీ నాన్ రిమూవబుల్ బ్యాటరీతోనే వస్తున్నాయి. ఈ తరుణంలో ఫోన్ లో ప్రతి భాగాన్ని బయటి నుంచి చూస్తూనే, అన్ని రకాలుగా ఫోన్ ను వినియోగించుకోవడాన్ని సాధ్యం చేసింది 'నథింగ్ ఫోన్ (1)' స్మార్ట్ ఫోన్.

ఈ ఫోన్ మంగళవారం భారత మార్కెట్లోకి విడుదలైంది. మూడు వేరియంట్లలో వచ్చిన వీటి ధరలు రూ.32,999, రూ.35,999, రూ.38,999. ఈ ఫోన్ కు వెనుక భాగం ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవాలి. చూడ్డానికి లోపలి భాగం బయటకు కనిపిస్తూ, ట్రాన్స్ పరెంట్ గా ఉంటుంది. దీనికితోడు 900 ఎల్ఈడీ లైట్లు కూడా అమర్చి ఉంటాయి. దీంతో ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదా కాల్ వచ్చినప్పుడు వెలిగిపోతూ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వైట్, బ్లాక్ రెండు రంగుల్లోనే ఇది లభిస్తుంది. 

వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉండడం మరో ఆకర్షణీయ అంశం. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778 ప్లస్ చిప్ సెట్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్, హోల్ పంచ్ డిస్ ప్లే తో ఉంటుంది. ఆండ్రాయిడ్ 12పై పనిచేస్తుంది. ఫోన్ బాక్స్ లో చార్జర్, బ్యాక్ కేసు ఉండవు. 8జీబీ, 128జీబీ వేరియంట్, 8జీబీ, 256 జీబీ స్టోరేజీ రకం, 12జీబీ, 256జీబీ సామర్థ్యంతో ఫోన్ వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగా పిక్సల్ సోనీ, 50 మెగా పిక్సల్ శామ్ సంగ్ కెమెరా లెన్స్ ఉంటాయి.

జూలై 21 నుంచి ఫ్లిప్ కార్ట్ వేదికపై విక్రయాలు జరుగుతాయి. హెచ్ డీఎఫ్ సీ కార్డుతో చెల్లించే వారికి రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. 

More Telugu News