Chandrababu: బాగా బరువు తగ్గారన్న జీవీఎల్... సరదాగా జవాబిచ్చిన చంద్రబాబు

Chandrababu funny talk with GVL
  • ఏపీకి వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము 
  • విజయవాడ తాజ్ గేట్ వే హోటల్లో టీడీపీ నేతలతో భేటీ
  • చంద్రబాబుతో నవ్వుతూ మాట్లాడిన జీవీఎల్, సోము
  • అందరి దృష్టిని ఆకర్షించిన వైనం

ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి వైసీపీ, టీడీపీ నేతల మద్దతు కోరేందుకు ఏపీకి వచ్చారు. వైసీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం, విజయవాడ తాజ్ గేట్ వే హోటల్లో టీడీపీ ప్రజాప్రతినిధులను కలిశారు. కాగా, ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ ఏపీ అగ్రనేతలు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

ముఖ్యంగా, చంద్రబాబుతో జీవీఎల్ సరదాగా సంభాషించారు. 'చంద్రబాబు గారూ మీరు బాగా బరువు తగ్గారు' అంటూ జీవీఎల్ పేర్కొన్నారు. అందుకు చంద్రబాబు చమత్కారంగా బదులిచ్చారు. "అప్పట్లో 70 కేజీలకు పైబడి ఉంటే, ఇప్పుడు 60 కేజీలకు పైబడి ఉన్నా" అంటూ సరదాగా సమాధానమిచ్చారు. దాంతో అక్కడ నవ్వులు విరబూశాయి. కాగా, తన ఏపీ పర్యటన ముగించుకున్న ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News