ఆగ‌స్టు 2 నుంచి బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర‌

  • ఇప్ప‌టికే రెండు విడ‌త‌ల యాత్ర‌ను పూర్తి చేసిన బండి సంజ‌య్‌
  • తాజాగా మూడో విడ‌త‌కు సిద్ధ‌మైన వైనం
  • యాత్ర వివ‌రాలేమీ లేకుండా తేదీని ప్ర‌క‌టించిన బీజేపీ
bandi sanjay praja sangrama yatra third phese willl start from august 2

తెలంగాణ‌లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర ఇప్ప‌టికే రెండు విడ‌త‌లుగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర మూడో విడ‌త‌ను బండి సంజ‌య్‌ ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు బీజేపీ రాష్ట్ర శాఖ మంగ‌ళ‌వారం ప్ర‌కటించింది. బండి సంజ‌య్ మూడో విడ‌త ప్ర‌జా సంగ్రామ యాత్ర ఎక్క‌డి నుంచి ప్రారంభ‌మ‌వుతుంది? ఏ దిశ‌గా సాగుతుంది? ఎక్క‌డ పూర్తవుతుంది? అన్న వివ‌రాల‌ను మాత్రం బీజేపీ రాష్ట్ర శాఖ వెల్ల‌డించ‌లేదు.

More Telugu News