Bumrah: ఒకే ఓవర్లో బుమ్రా డబుల్... రూట్ డకౌట్

Bumrah double in single over against England
  • ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన బుమ్రా
  • జాసన్ రాయ్, రూట్ లను వెనక్కి పంపిన వైనం
  • స్టోక్స్ ను అవుట్ చేసిన షమీ
  • ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు
ఇంగ్లండ్ తో తొలి వన్డేలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా విజృంభించాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. దాంతో ఇంగ్లండ్ జట్టు 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ఓపెనర్ జాసన్ రాయ్ ని ఇన్ సైడ్ ఎడ్జ్ తో బౌల్డ్ చేసిన బుమ్రా, అదే ఓవర్ చివరిబంతికి స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ ను బౌన్స్ తో బోల్తాకొట్టించాడు. ఆఫ్ స్టంప్ ఆవల బుమ్రా విసిరిన బంతిని స్లిప్స్ పైనుంచి తరలించబోయిన రూట్ వికెట్ కీపర్ పంత్ కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చాడు. 

ఆ తర్వాత ఓవర్లోనే షమీ తనవంతుగా బెన్ స్టోక్స్ ను డకౌట్ చేయడంతో ఇంగ్లండ్ కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 3 ఓవర్లలో 3 వికెట్లకు 15 పరుగులు. కెప్టెన్ జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో క్రీజులో ఉన్నారు.
Bumrah
Double Wicket
Team India
England
1st ODI

More Telugu News