Xiaomi: షావోమీ నుంచి స్మార్ట్ ఫ్యాన్ విడుదల

Xiaomi launches a smart standing fan in India for a price of Rs 6999
  • స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2 ఆవిష్కరణ
  • ధర రూ.6,999
  • ఫ్యాన్ స్పీడ్ కు 1 నుంచి 100 లెవల్స్
స్మార్ట్ ఫోన్లతో బాగా పాప్యులర్ అయిన షావోమీ, స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి వాయిస్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఉండడం ఆకర్షణీయం. ఎంఐ హోమ్ యాప్ తో ఈ ఫ్యాన్ ను ఆన్ ఆఫ్, స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. మరింత ఎయిర్ ఫ్లో కు వీలుగా 7 ప్లస్ 5 షేప్డ్ వింగ్స్ ను కంపెనీ ఈ ఫ్యాన్ లో ఏర్పాటు చేసింది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తో వాయిస్ ద్వారా నియత్రించుకోవచ్చు. 

ఫ్యాన్ స్పీడ్ ను 1 నుంచి 100 లెవల్స్ మధ్య సెట్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. నేచురల్ బ్రీజ్, డైరెక్ట్ బ్లో తదితర భిన్నమైన మోడ్స్ లోకి మార్చుకోవచ్చు.  బీఎల్ డీసీ మోటార్ (కాపర్ వైర్), డ్యుయల్ ఫ్యాన్ బ్లేడ్లు ఉంటాయి. గరిష్ఠంగా 14 మీటర్ల వరకు గాలిని ఇస్తుంది. ఫ్యాన్ ఎత్తును కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ ధర రూ.6,999. షావోమీ పోర్టల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో 7 ప్లస్ 5 అంటే.. ఏడూ రెక్కలు ఒక వైపునకు తిరిగి ఉంటే, ఐదు రెక్కలు మరో దిశలో ఉంటాయి. దీనివల్ల గాలి బాగా వస్తుంది.
Xiaomi
launches
smart standing fan
price of Rs 6999

More Telugu News