smart phones: ఆరు నెలల్లో ధరలు తగ్గిన ఫోన్లు ఇవే..!

  • వన్ ప్లస్ 9 5జీ ఫోన్ రూ.12,000 తక్కువ ధరలో విక్రయం
  • వివో వీ21 5జీపై రూ.5,000 ప్రైస్ కట్
  • అమెజాన్ సైతం కార్డుపై ఆఫర్లు
smart phones prices are cutting down due to lack of demand

స్మార్ట్ ఫోన్ అన్నది సాధారణ అవసరంగా మారిపోయింది. పైగా ఒక ఫోన్ వినియోగ కాలం కూడా తగ్గుతోంది. చేతిలో నుంచి పడిపోయి ఫోన్లు దెబ్బతినడం, కొత్త ఫీచర్లతో వస్తున్న ఫోన్లకు అప్ గ్రేడ్ కావడం కారణాలుగా ఉంటున్నాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం కొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లను తీసుకొస్తుంటాయి. ఇలా కొత్త మోడల్ వచ్చిన తర్వాత అప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని మోడళ్ల ధరలు తగ్గుతుంటాయి. అలా గత ఆరు నెలల కాలంలో ధరలు తగ్గిన మొబైల్స్ ను పరిశీలిస్తే..

 ఐక్యూ 7.. 8జీబీ, 12జీబీతో రెండు వేరియంట్లుగా మార్కెట్లోకి విడుదలైంది. తొలుత వీటి ధరలు రూ.31,990, రూ.35,990. ఈ రెండింటి విక్రయ ధరలను కంపెనీ రూ.2,000 చొప్పున తగ్గించింది. దీనికి అదనంగా అమెజాన్ సైతం రూ.1,000 తగ్గింపు ఇస్తోంది. ఇక శామ్ సంగ్ గెలాక్సీ ఎం32 5జీ ధర ఏకంగా రూ.2,000 తగ్గింది. 6జీ ర్యామ్ వెర్షన్ ధర రూ.18,999. దీన్ని ఇప్పుడు రూ.16,999కే సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ ఎం52 5జీ బేసిక్ మోడల్ ధర సైతం రూ.5,000 తగ్గింది. ఇప్పుడు ఇది రూ.24,999కు లభిస్తోంది.

వన్ ప్లస్ 9 5జీ ఫోన్ 8జీబీ వేరియంట్ రూ.49,999కు, 12జీబీ ర్యామ్ రూ.54,999కు లభించగా.. రెండు విడతలుగా రూ.5,000, రూ.7,000 చొప్పున కంపెనీ తగ్గించింది. దీంతో 8జీబీ రకం రూ.37,999కు, 12జీబీ రకం రూ.42,999కు లభిస్తోంది. వన్ ప్లస్ 9 ప్రో ధర సైతం గత ఆరు నెల్లో రెండు సార్లు తగ్గింది. బేస్ వేరియంట్ ఆరంభంలో రూ.64,999కు లభించగా, దీని ధర తాజాగా రూ.49,999. 

 ఇక వివో వీ21 5జీ ధర సైతం రూ.5,000 తగ్గింది. వివో వీ21ఈ 5జీ ధర కూడా రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ.23,990. ఎంఐ 11ఎక్స్ ప్రో ఆరంభ ధర రూ.34,999. దీని ధర కూడా రూ.5,000కు తగ్గింది. రెడ్ మీ నోట్ 10ఎస్ 6జీబీ, 64జీబీ లాంచింగ్ ధర రూ.14,999. అది ఇప్పుడు రూ.12,999కే లభిస్తుంది. 128జీబీ స్టోరేజీ సైతం రూ.14,999కు లభిస్తోంది. ఇంకా రెడ్ మీ నోట్ 10టీ, జియో ఫోన్ నెక్ట్స్ రూ.4,599కు లబిస్తున్నాయి.

More Telugu News