liger: 'లైగర్' పాట విడుదల.. విజయ్ దేవరకొండ మాస్ డ్యాన్స్ అదుర్స్!

Vijay Deverakonda energetic dance number in Liger song Akdi Pakdi
  • లైగర్‌‌ నుంచి ‘దివానా హోగయా’ పాట విడుదల
  • ఫ్లోర్ స్టెప్స్ తో ఆశ్చర్య పరిచిన విజయ్
  • ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు లైగర్
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా కోసం ఇద్దరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కిందట మొదలైన ఈ క్రేజీ కాంబినేషన్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ప్రోమోలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 
 
తాజాగా ఈ సినిమాలోని ‘అక్డీ పక్డీ.. లైగర్‌‌ దివానా హోగయా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఫుల్ జోష్ తో కలర్ ఫుల్ గా ఉన్న ఈ పాట అభిమానులను ఆకట్టుకునేలా వుంది. స్టైలిష్ లుక్ లో,  మాస్‌ స్టెప్పులతో విజయ్ రెచ్చిపోయాడు. ముఖ్యంగా ఫ్లోర్ స్టెప్ నెట్ లో వైరల్ అయింది. ఈ పాట లిరిక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. 
 
 ‘నిన్నే చూసి ఓ మై డార్లింగ్ మనసే ఫ్లై ఫ్లై హోగయా’ అంటూ అనన్య పాండే అందాన్ని విజయ్ పొగుడుతుంటే.. ‘చక్కని చుక్కని పక్కనపెట్టుకు దిక్కులు చూడకు.. కళ్లల్లోకి కళ్లు పెట్టి చెప్పు ఐలవ్యూ’ అంటూ విజయ్‌తో అనన్య పాండే హుషారుగా స్టెప్పులేసింది. భాస్కరభట్ల రవికుమార్ రాసిన పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు. లిజో జార్జ్, డీజే చేతాస్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్,  మకరంద్ దేశ్‌పాండే, అలీ, విషురెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ జొహార్‌‌తో కలిసి పూరి, చార్మి నిర్మించారు.
liger
movie
Puri Jagannadh
Vijay Deverakonda
ananya pande

More Telugu News