Anna Canteen: 2018లో స‌రిగ్గా ఇదే రోజు... అంటూ 'అన్నా క్యాంటీన్ల‌'ను గుర్తుచేసిన టీడీపీ

tdp reminds anna canteens opening in andhra pradesh with a tweet
  • 2018 జులై 11న ఏపీలో అన్నా క్యాంటీన్ల ప్రారంభం
  • 35 ప‌ట్ట‌ణాల్లో 100 అన్నా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసిన టీడీపీ స‌ర్కారు
  • అన్నా క్యాంటీన్ల‌ను ప్రారంభిస్తున్న చంద్ర‌బాబు ఫొటోల‌ను జ‌త చేసిన టీడీపీ
ఏపీలో టీడీపీ పాల‌న‌లో అన్నా క్యాంటీన్ల పేరిట అతి త‌క్కువ ధ‌ర‌కే ఆహారాన్ని అందించే ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో వైసీపీ పాల‌న మొద‌ల‌య్యాక అన్నా క్యాంటీన్ల‌ను ర‌ద్దు చేసిన విష‌య‌మూ విదిత‌మే. అన్నా క్యాంటీన్ల‌ను గుర్తు చేస్తూ టీడీపీ అధికారిక ట్విట్ట‌ర్ సోమ‌వారం ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. స‌రిగ్గా ఇదే రోజు 2018లో టీడీపీ ప్ర‌భుత్వం ఏపీ వ్యాప్తంగా 35 ప‌ట్ట‌ణాల్లో 100 అన్నా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసిందంటూ స‌ద‌రు ట్వీట్‌లో పేర్కొంది. 

ఈ సంద‌ర్భంగా నాడు అన్నా క్యాంటీన్ల‌ను ప్రారంభిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఫొటోల‌ను కూడా ఆ పార్టీ త‌న ట్వీట్‌కు జ‌త చేసింది. ఈ ఫొటోల్లో చంద్ర‌బాబు అన్నా క్యాంటీన్‌లో స్వ‌యంగా ఆహారం తీసుకుని, పార్టీ నేత‌ల‌తో క‌లిసి భుజిస్తున్న చిత్రాలు ఉన్నాయి.
Anna Canteen
TDP
Chandrababu
Andhra Pradesh

More Telugu News