Andhra Pradesh: భారీ వ‌ర్షాల కార‌ణంగా జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న వాయిదా

ap cmys jagan tour to vizag postponed to 15th of this month
  • ఈ నెల 13న విశాఖ‌కు వెళ్ల‌నున్న జ‌గ‌న్‌
  • ఇప్ప‌టికే టూర్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేసిన ప్ర‌భుత్వం
  • భారీ వ‌ర్షాల‌తో 15కు వాయిదా ప‌డిన జ‌గ‌న్ టూర్‌

భారీ వ‌ర్షాల కార‌ణంగా విశాఖ‌లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్ట‌నున్న పర్య‌ట‌న వాయిదా ప‌డింది. ఆటో డ్రైవ‌ర్ల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న వాహ‌న మిత్ర నిధుల‌ను విడుద‌ల చేసే నిమిత్తం ఈ నెల 13న విశాఖ ప‌ర్య‌ట‌న‌ను జ‌గ‌న్ ఖ‌రారు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. విశాఖ‌లోని ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ఏర్పాటు చేయ‌నున్న కార్య‌క్ర‌మంలో వాహ‌న మిత్ర నిధుల‌ను జ‌గ‌న్ ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. 

అయితే గ‌డ‌చిన రెండు రోజులుగా దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయంటూ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక‌లు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ఈ నెల 15కు వాయిదా వేస్తున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం సోమ‌వారం సాయంత్రం ప్ర‌కటించింది. ఈ టూర్ షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

  • Loading...

More Telugu News