Temjen Imna: బ్రహ్మచారులుగా ఉండండి... జనాభా పెరిగే అవకాశమే లేదంటున్న నాగాలాండ్ మంత్రి

Nagaland minister Temjen Imna comments on population
  • నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
  • ట్విట్టర్ లో స్పందించిన టెమ్జెన్ ఇమ్నా
  • బ్రహ్మచారుల ఉద్యమంలో చేరాలని పిలుపు
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ సందర్భంగా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనమంతా వివేకంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

"జనాభా పెరుగుదలపైనా, సంతానం కలిగి ఉండడంపైనా ప్రచారంలో ఉన్న విధానాలపై ఆలోచిద్దాం... లేకపోతే నాలాగా ఏకో నారాయణలా ఉండండి... అందరం కలిసి సుస్థిర భవిష్యత్తు దిశగా పాటుపడదాం... రండి, బ్రహ్మచారుల ఉద్యమంలో చేరండి" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 

టెమ్జెన్ ఇమ్నా నాగాలండ్ క్యాబినెట్ లో ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నాగాలాండ్ బీజేపీకి ఆయనే అధ్యక్షుడు. ఎప్పుడూ సరదాగా ఉంటారని ఆయనకు పేరుంది.
Temjen Imna
Population
Singles
World Population Day
Nagaland

More Telugu News