నీటి ప్రవాహానికి ఎదురుగా గాల్లోకి లేచి మరీ జంప్ చేస్తున్న మత్స్యరాజాలు... వీడియో పోస్ట్ స్మితా సభర్వాల్
- తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు
- ప్రాజెక్టులు నిండి పొంగి పొరలుతున్న నీటి ప్రవాహం
- పోచారం ప్రాజక్టులో కనిపించిన ఆసక్తికర దృశ్యం
ఇక ఈ వీడియోలో వున్న దృశ్యాలు మరెక్కడివో కాదు.. తెలంగాణలోనివే. బారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పొంగి పొరలుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోచారం ప్రాజెక్టులోనూ నీటి ప్రవాహం పొంగుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండిన నేపథ్యంలో కిందికి నీరు ఎగసిపడుతోంది. ఈ నీటి ప్రవాహంలో కిందకు వెళ్లిపోతున్న చేపలు అలా కిందకు జారిపోతు కూడా గాల్లోకి లేచి మరీ పైకి జంప్ చేస్తున్నాయి.